వెంకీని కాదన్న రెడ్ హీరో..

వెంకీని కాదన్న రెడ్ హీరో..

రామ్ పోతినేని యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా తెలుగు చిత్ర సీమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా దేవదాసుతోనే భారీ హిట్ అందుకున్న రామ్. గత కొంత కాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోయాడు. చెప్పోకోదగ్గ హిట్ కోసం తెగ కష్టపడ్డాడు. అదే సమయంలో మాస్ మసాలా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ అంటే ఏంటో చూపించే విధంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాతో రామ్ మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. ఈ సినిమాలో రామ్ చేసిన మాస్ యాక్టింగ్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించాడంటే నమ్మండి. దీని తరువాత రామ తెరకెక్కించిన సినిమా రెడ్. ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమాలో రామ్ ఒకవైపు పక్కా మాస్‌తో పాటుగా పక్కా క్లాస్‌లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈసినిమా పై అంచనాలు తారాస్థాయిని చేరాయి. అనుకున్న రేంజ్‌లో ప్రేక్షకులను అలరించలేక పోయినా పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాని పర్వాలేదు అన్నా హీరో యాక్టింగ్ మాత్రం అదరగొట్టేశాడని అభిమానులు గర్వంగా చెప్పుకున్నారు. అటువంటి రామ్ తన సినిమా కథలను ఆచితూచి కొత్త తరహాలో ఉంటేనే ఓకే చేస్తానని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు రామ్ తన నూతన చిత్రంపై ఎటుంటి ప్రకటన చేయలేదు. నిజానికి రామ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అయితే తాజాగా రామ్ వెంకి కుడుములతో చర్చలు చేశాడు. కానీ వెంకీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చక సినిమాకి నో చెప్పాడట. మరి రామ్ తన కొత్త సినిమాను ఇంకెప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.