నింగిని తాకేలా రామాలయం..! 4 నెలల్లో నిర్మాణం పూర్తి...

నింగిని తాకేలా రామాలయం..! 4 నెలల్లో నిర్మాణం పూర్తి...

నాలుగు నెలల్లో అయోధ్యలో రామాలయం నిర్మిస్తామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా... అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అవాంతరాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.. ఇక రానున్న నాలుగు నెలల్లో నింగిని తాకేలా భారీ రామ మందిరాన్ని అక్కడ‌ నిర్మించ‌నున్నట్టు స్పష్టం చేశారు అమిత్‌షా... జార్ఖండ్ ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన్న అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. రామ మందిరం కోసం వందేళ్లుగ భారతీయులు ఎదురుచూస్తున్నారన్న ఆయన... రాముడు జన్మించిన చోటే మందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి.. సుందరమైన రామ మందిరాన్ని నిర్మిస్తామన్నారు.