కరోనా లాంటి భయంకరమైనవి వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి గొప్పవి వస్తాయి : ఆర్జీవీ

కరోనా లాంటి భయంకరమైనవి వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి గొప్పవి వస్తాయి : ఆర్జీవీ

చైనా నుండి వచ్చిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా 21 వేల మంది మరణించగా... 4.79 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే ఈ కరోనా ప్రభావం మన దేశం లో కూడా బాగానే కనిపిస్తుంది. మన దేశం లో ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 693 గా ఉండగా మరణించిన వారి సంఖ్య 13 కు చేరుకుంది. అయితే నిన్న ఉగాది సందర్బంగా దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తరువాత తెరకెక్కిస్తున్నా ఆర్ఆర్ఆర్ ''రౌద్రం రుధిరం రణం'' సినిమా పేరుని మోషన్ పోస్టర్ తో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే విడుదలైన మోషన్ పోస్టర్ పై సెలెబ్రిటీలు అందరూ ప్రశంశలు కురిపించారు. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ కూడా దీని పై తనదైన రీతిలో స్పందించారు. ఆయన ట్విట్టర్ లో..." కరోనా వైరస్ అందరిని వణికిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో.. ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మాకు భవిష్యత్తులో మంచి జరుగుతుందనే ఆశను కలిగించావు. అలాగే కరోనా లాంటి భయంకరమైనవి వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి గొప్పవి కూడా వస్తాయి.." అంటూ ట్వీట్ చేసాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సమయం లోనే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.