మర్డర్ ట్రైలర్ విడుదల చేసిన వర్మ... 

మర్డర్ ట్రైలర్ విడుదల చేసిన వర్మ... 

కరోనా వైరస్ సమయం లో కూడా సినిమా తీసి సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ప్రస్తుతం తీస్తున్న సినిమాల్లో ‘మర్డర్‌’ అనే  సినిమా కూడా ఒకటి. ఆయన తీసిన ప్రతి సినిమా వెనుక వివాదం తప్పకుండ ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య ఘటన పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మిర్యాలగూడ కు చెందిన మారుతీరావు తన కూతురు అమృత ప్రేమించి పెళ్లాడిన వ్యక్తిని పరువు కోసం హత్య చేయించి ఆ తర్వాత కొద్ది  నెలలకే ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా వర్మ మర్డర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే వర్మ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఈ రోజు ఉదయం 9.08 గంటలకు మర్డర్ ట్రైలర్‌ను విడుదల చేసాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో ఈ సినిమా తీస్తున్నాడు వర్మ. అయితే ఈ సినిమాలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటిస్తున్నారు.