బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రామ్

బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రామ్

టాలీవుడ్ హీరోలలో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న రామ్ తన బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ నటించిన తాజా చిత్రం రెడ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రేపు విడుదలకు సన్నద్దమయింది. ఈ సినిమాలో రామ్ ద్వాపాత్రాభినయం చేశాడు. రెండూ కూడా పూర్తి విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఒకటి పక్కా క్లాస్‌ అయితే మరోకటి ఊరమాస్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికీ విడుదలైన ట్రైలర్ అందరిలో ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. అయితే గత కొన్నాళ్ళుగా రామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై హీరో రామ్ క్లారిటీ ఇచ్చాడు. అతడి సమాధానం విన్న అభిమానులు ఆశ్చర్యపోయారు. తనకు హిందీలో మార్కెట్ ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ‘నాకు హిందీలో కూడా మార్కెట్ ఉండటం చాలా ఆనందకర విషయం. కానీ నేను ఇప్పట్లో హిందీలో సినిమా చేసే ఆలోచనలో లేను. ప్రస్తుతానికి తెలుగులో మరికొన్ని మంచి సినిమాలు చేస్తాన’ని రామ్ చెప్పాడు. అంతేకాకుండా తన తదుపరి చిత్రంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తీసుకున్న వెంటనే కచ్చితంగా చెప్తానని అన్నాడు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అంటూ తనలోని మాస్ మసాలాను అందరికి చూపించిన రామ్. ఈ రెడ్ సినిమాలో అంతకు మించి మాస్‌గా కనిపించనున్నాడట. అభిమానులు రామ్ నుంచి కోరుకునే వాటన్నింటినీ ఈ సినిమాలో పొందుపరిచామని రెడ్ మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సినిమాపై అంచనాలు కూడా అదే విధంగా తారాస్థాయిలో ఉన్నాయి. మరి అభిమానుల అంచనాలను రెడ్ సినిమాతో రామ్ అందుకుంటాడేమో వేచి చూడాలి.