ఎక్కడ చూసినా ఆ ఒక్క పదమే... 'వకీల్ సాబ్'పై చరణ్ స్పందన

ఎక్కడ చూసినా ఆ ఒక్క పదమే... 'వకీల్ సాబ్'పై చరణ్ స్పందన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడేళ్ళ తరువాత తమ అభిమాన నటుడి సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద మెగా అభిమానుల హంగామా మామూలుగా లేదు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వకీల్ సాబ్' మూవీపై రియాక్ట్ అవుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "ఎక్కడ చూసినా ఒకటే పదం వింటున్నా... పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్...! పవన్ కళ్యాణ్ గారికి మరో ల్యాండ్ మార్క్ మూవీ. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సినిమా టీం అందరికి శుభాకాంక్షలు" అంటూ మెగా అభిమానుల జోష్ మరింత రెట్టింపు అయ్యేలా ట్వీట్  చేశాడు చరణ్.

 

ఇక ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రాన్ని మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్యామిలీతో థియేటర్లో వీక్షించారు. 'పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాబాయ్' అని వరుణ్ ట్వీట్ చేయగా... 'అబ్జెక్షన్... వాటే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్... అదరగొట్టావు మామ... రైట్ టైంలో రైట్ మాన్ రైట్ మూవీ అంటూ వరుణ్ ట్వీట్ చేశాడు. ఇక సినిమా చూసిన తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా "మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌వ‌న్ కళ్యాణ్ లో మ‌ళ్లీ అదే వేడి, అదే వాడి, అదే పవర్... ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజ‌లి, అనన్య వాళ్ల పాత్ర‌ల్లో జీవించారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ క‌పూర్ జీకి, డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ తో పాటు మిగ‌తా టీమ్ కి నా శుభాకాంక్ష‌లు. అన్నింటికీ మించి మ‌హిళ‌ల‌కి ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌స‌ర‌మైన చిత్రం. ఈ వ‌కీల్ సాబ్ కేసుల‌నే కాదు.. అంద‌రి మ‌న‌సుల్నీ గెలుస్తాడు" అంటూ తన రివ్యూ ఇచ్చేశారు.