ఎన్టీఆర్ పెళ్లిరోజు.. చరణ్ సర్‌ప్రైజ్

ఎన్టీఆర్ పెళ్లిరోజు.. చరణ్ సర్‌ప్రైజ్

ఈ మధ్య తెలుగు హీరోల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ కనిపిస్తోంది. ఒకరి సినిమా ఫంక్షన్లకు ఒకరు వెళ్లడం.. ఆల్‌ది బెస్ట్ చెప్పడం.. పార్టీలు, ఇతర కార్యక్రమాల్లో హీరోలంతా సన్నిహితంగా మెలుగుతున్నారు. వీళ్లందరిలో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ కాస్త ముందుంటున్నారు. మొన్నామధ్య భరత్ బహిరంగ సభకు హాజరై మహేశ్‌బాబుకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఆ తర్వాత మహానటి ఆడియో లాంఛ్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లి. కీర్తి సురేశ్, విజయ్ దేవరకొండ, సమంతల ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాంటి ఎన్టీఆర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్-ప్రణతీల పెళ్లిరోజు సందర్భంగా వారిద్దరిని తన శ్రీమతి ఉపాసనతో కలిశాడు చెర్రీ.. ఎన్టీఆర్ కుమారుడిని తన ఒళ్లో కూర్చోబెట్టుకున్న ఉపాసన, రామ్‌చరణ్‌ భుజంపై చెయ్యి వేసిన ఎన్టీఆర్ ఉన్న ఫోటోను ఉపాసన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.  దీంతో మెగా, నందమూరి అభిమానులు ఈ పిక్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అన్నట్లు ఎన్టీఆర్, చరణ్‌లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.