చరణ్, త్రివిక్రమ్ కాంబో వచ్చేది అప్పుడే..

చరణ్, త్రివిక్రమ్ కాంబో వచ్చేది అప్పుడే..

మెగాపవర్ స్టార్ రాంచరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో సినిమా రానుందట. కానీ అదెప్పుడు ప్రారంభం అవుతందన్న విషయాలపై క్లారిటీ లేదు. అయితే ఇటీవల కరోనా బారిన రాంచరణ్ కొన్న రోల్లోనే కోలుకున్నాుడు. కరోనా నెగిటివ్ వచ్చిన రాంచరణ్ వెంటనే ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్దమయ్యాడు. అయితే కరోనా కారణంగా దర్శకధీరుడు రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ షెడ్యూల్స్‌లో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తాడన్న దానిపై క్లారటీ లేదు. అంతేకాకుండా దీనిపై రాంచరణ్ కూడా ఎటువంటి ఎనౌన్స్‌మెంట చేయడం లేదు. అయితే రాంచరణ్ స్టార్ దర్శకుడితో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఆ దర్వకుడు ఎవరన్నది తెలీదు. కానీ కొన్ని రోజుల క్రితం చరణ్ జెర్సీ దర్శకుడితో చర్చలు చేశాడు. అయితే ప్రస్తుతానికి గౌతమ్ జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేయడంలో బిజీగా ఉన్నాడు. అయితే ఇంతలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి చెర్రీ ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ తన కథను వినిపించేందుకు సిద్దమయిన తరువాత చెర్రీ కరోనా బారిన పడటంతో ఈ చర్చలు నిలిచిపోయాయి. దాంతో త్వరలో త్రివిక్రమ్ తన కథను చెర్రీకి చెప్తాడని, వీరి కాంబో సినిమా పట్టాలెక్కేందుకు సిద్దమవుతుందనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై ఇంకా అదికారిక ప్రకటన రావాల్సిఉంది. అంతవరకు వేచి చూడాల్సిందే.