రాముడు-గుహుడి భారీ విగ్రహం ఎక్కడో తెలుసా?

రాముడు-గుహుడి భారీ విగ్రహం ఎక్కడో తెలుసా?

బీజేపీ నాయకులు పోటాపోటీగా రాముడి విగ్రహాలు ప్రతిష్టించే కార్యక్రమం చేపడుతున్నారు. మొన్ననే దీపావళి రోజున.. అయోధ్యలో రాముడి భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ప్రకటించారు. ఆ వెంటనే దాని కార్యాచరణకు పురమాయించారు. అయితే అయోధ్యలో విగ్రహం పనుల ప్రారంభం కొలిక్కి రాకముందే.. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య కొత్త ప్రకటన చేశారు. 

అలహాబాద్ (ప్రస్తుత ప్రయాగరాజ్) లోని శృంగవేర్ పూర్ లో లో రాముడు, నిషాదరాజు గుహుడు ఆలింగనం చేసుకున్న భారీ విగ్రహం నెలకొల్పుతామని చెప్పారు. శృంగవేర్ పూర్లో గంగానది ఒడ్డునే రాముడు-గుహుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, అయితే అదింకా ఆలోచన దశలోనే ఉందని, కార్యరూపాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. 

రాముడు వనవాసానికి బయల్దేరినప్పుడు గంగానదిని దాటించిన  నిషాద రాజే గుహుడు. ఆ తరువాత భరతుడు రాముడి కోసం వెదుకుతూ.. కైక ద్వారా తనకు సంక్రమించిన రాజ్యాన్ని అన్నకు అప్పగించాలన్న ఆత్రుతతో బయల్దేరాడు. భరతుడి రాకను తప్పుగా అర్థం చేసుకున్న గుహుడు.. భరతుణ్ని అడ్డుకునేందుకు సన్నద్ధమై ఉంటాడు. అయితే వేగుల ద్వారా అసలు విషయం తెలుసుకోవడంతో.. భరతుడిని సాదరపూర్వకంగా ఆహ్వనిస్తాడు. అలా భరతుడిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చిన ప్రదేశమే ఈనాటి శృంగవేరపురం. అక్కడే ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మౌర్య చెప్పారు. 

ఇక శృంగవేరపూర్ లో ఎంబీసీలు, గిరిజనులు పెద్దసంఖ్యలో ఉన్నారు. వారి ఓట్ల కోసమే ఈ ఎత్తుగడ అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గోరఖ్ పూర్ బై ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థి మీద.. ఎస్పీ తరఫున పోటీ చేసిన ప్రవీణ్ నిషాద్ గెలుపొందారు.