నిర్మాత... దర్శకుడి మధ్య ఐదేళ్లు నలిగిపోయిన రకుల్...
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే, ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో రకుల్ ప్రీత్ కు ఆఫర్లు తగ్గిపోయాయి. సీనియర్ హీరో నాగార్జునతో చేసిన మన్మధుడు 2 సినిమా ఫెయిల్ కావడంతో ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా అడుగుంటాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది.
అయితే, బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కావడంతో అక్కడ సినిమాలు చేస్తున్నది. రకుల్ ప్రీత్ సింగ్ ఐదేళ్ల క్రితమే బాలీవుడ్ లో షిమ్లా మిర్చి సినిమా చేసింది. సినిమా పూర్తయ్యి ఐదేళ్లు అయ్యింది. కానీ, ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. వయాకామ్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియలేదు. సినిమాకు రమేష్ షిప్పి దర్శకత్వం వహించారు. సినిమా పూర్తి చేసి నిర్మాతల చేతుల్లో పెడితే ఆ సినిమాను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు.
జనవరి 3 వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నారు. కానీ, థియేటర్స్ లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో సినిమాను రిలీజ్ చేస్తారట. దీంతో దర్శకుడు రమేష్ షిప్పి, నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితమే సినిమా రిలీజ్ అయ్యి ఉంటె బాగుండేదని, ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా దగ్గర పెట్టుకున్న నిర్మాతలు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడం ఏంటని రకుల్ అంటోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)