రివ్యూ: రాక్షసుడు

రివ్యూ: రాక్షసుడు

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్‌ కనకాల, కాశీ విశ్వనాథ్, కేశవ్‌ దీపక్, రవిప్రకాష్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్
మ్యూజిక్ : జిబ్రాన్
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేష్‌ వర్మ  

భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటి వరకు తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేశారు.  కాగా, ఇప్పుడు తన ఇమేజ్ ను పక్కన పెట్టి కథపై నమ్మి, తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేశారు.  ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా తెలుసుకుందాం.  

కథ: 

బెల్లంకొండ శ్రీనివాస్ కు ఓ కల ఉంటుంది.  ఎప్పటికైనా ఓ క్రైమ్ థ్రిల్లర్ తో సినిమా చేయాలని అనుకుంటాడు. తనకు కనిపించిన క్రైమ్ లకు సంబంధించిన పలు వివరాలను సేకరించి జాగ్రత్తగా భద్రపడుచుకుంటుంటాడు.  సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని ఎంత ట్రై చేసినా కుదరదు.  దీంతో చేసేదిలేక సినిమాలను పక్కన పెట్టి, పోలీస్ ఉద్యోగంలో చేరిపోతాడు.  అలా ఉద్యోగంలో చేరిన బెల్లంకొండకు అనేక సవాళ్లు ఎదురౌతాయి.  స్కూల్ పిల్లలకు సంబంధించిన హత్యలు వరసగా జరుగుతుంటాయి.  ఆ హత్యల కేసు తన దగ్గరికి వస్తుంది.  గతంలో తాను సేకరించిన వివరాలకు అనుగుణంగా నేరాలను ఛేదించాలని చూస్తాడు.  కానీ అధికారులు అందుకు ఒప్పుకోరు.  అదే సమయంలో బెల్లంకొండ కుటుంబానికి చెందిన ఒకరు కూడా హత్యకు గురికావడంతో.. దానిని సీరియస్ గా తీసుకొని కేసును పరిష్కరించేందుకు ప్రయత్నం మొదలు పెడతాడు.  ఆ హత్యలు చేసింది ? ఎందుకు చేస్తున్నారు? బెల్లంకొండ ఆ హత్యల మిస్టరీని ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

తమిళంలో ఆల్రెడీ సినిమా వచ్చింది.  ఆ సినిమా మంచి థ్రిల్లింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. రచ్చసన్ సినిమాకు రీమేక్ కావడంతో.. సినిమాపై ఆసక్తి పెరిగింది.  కాస్తంత థ్రిల్లింగ్ కలిగించే విధంగా సినిమాను ప్రజెంట్ చేస్తే చాలు తప్పకుండా సినిమా హిట్ అవుతుంది.  థ్రిల్లింగ్ సినిమా కావడంతో ఒకదానికి మరొకటి లింక్ ఉంటుంది.  ఆ లింకులను ఎలా ఛేదించుకుంటూ వెళ్లారు అన్నది సినిమాలో హైలైట్ అయితే చాలు.  హిట్ అయినట్టే సినిమా.  హీరో పోలీస్ కావడానికి ముందు దర్శకుడిగా మారాలని అనుకోని క్రైమ్ లకు సంబందించిన వివరాలను సేకరించుకుంటుంటాడు కాబట్టి, క్రైమ్ జరిగినపుడు దానిని ఎలా పరిశోధించాలనే విషయం హీరోకు తెలుస్తుంది.  దానికి అనుగుణంగానే లింకులను ఛేదించుకుంటూ వెళ్తున్నప్పుడు సినిమాలో అనేక థ్రిల్లింగ్ విషయాలు బయటకు వస్తుంటాయి.  హత్యల వెనుక ఓ సైకో హస్తం ఉందని తెలిసి షాక్ అవుతారు.  ఆ సైకోని ఎలా పట్టుకున్నారు అనే విషయాలను చూపించిన విధానం బాగుంది.  అయితే, హత్యల వెనుక ఓ సైకో ఉన్నాడని తెలిసినా కూడా.. కథను సాగదీయడమే సినిమాకు మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు: 

బెల్లంకొండ ఇమేజ్ ను పక్కన పెట్టి చేసిన సినిమా కావడంతో థ్రిల్లింగ్ బాగా పండింది. పోలీస్ అధికారి పాత్రలో బెల్లంకొండ నటన బాగుంది.  భావోద్వేగాలకు అనుగుణంగా నటించి  మెప్పించారు.  అనుపమ పరమేశ్వరన్ పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ మెప్పించింది.  మిగతా పాత్రల్లో నటీనటులు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

తమిళంలో రిలీజై సూపర్ హిట్టైన సినిమాను తెలుగులో యాజ్ టీజ్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు.  థ్రిల్లింగ్ సినిమాలకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ లు ప్లస్ అవుతాయి. ఈ సినిమా విషయంలో కూడా అలానే జరిగింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

కథనాలు 

నటీనటులు 

మ్యూజిక్ 

సినిమాటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ లో సాగదీత 

చివరిగా: రాక్షసుడు థ్రిల్ ను కలిగించాడు.