ఘనంగా రజనీ కుమార్తె వివాహం !

ఘనంగా రజనీ కుమార్తె వివాహం !

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య వివాహం ఈరోజు ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్త, నటుడు విశాగన్ వనంగముడితో జరిగింది.  చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి రజనీ మిత్రుడు, నటుడు కమల్ హాసన్ తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇంకొంతమంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.  సినీ పరిశ్రమ నుండి మోహన్ బాబు, లక్ష్మి మంచు, రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్, ఆండ్రియా, అనిరుద్ రవిచంద్రన్, శివాజీ ప్రభు, ప్రేమ్ కుమార్, మంజిమ మోహన్, అతిథిరావ్ హైదరి, దర్శకుడు మణిరత్నం రజనీ ప్రత్యేక ఆహ్వానం మేరకు వేడుకలో పాల్గొన్నారు.