రాజకీయ రంగప్రవేశంపై రజినీకాంత్ నేడు కీలక ప్రకటన... 

రాజకీయ రంగప్రవేశంపై రజినీకాంత్ నేడు కీలక ప్రకటన... 

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై నేడు కీలక ప్రకటన చేయబోతున్నారు.  చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయాలలోకి ఎంట్రీపై అనేక కథనాలు వెలువడ్డాయి. 2019 లోనే రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు.  కానీ, రాజకీయాల్లోకి రావటానికి ఇంకా సమయం ఉందని, త్వరలోనే అన్ని విషయాలు చెప్తానని గతంలో పేర్కొన్నారు.  2020 మార్చి తరువాత రాజకీయాల్లోకి వస్తారని అనుకుంటే కరోనా కారణంగా కుదరలేదు.  ప్రస్తుతం రజినీకాంత్ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.  కరోనా మహమ్మారి పూర్తిగా దూరం అయ్యే వరకు రజిని సినిమాలకు కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది.  అయితే, హఠాత్తుగా రజినీకాంత్ ఈరోజు తన రాజకీయరంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఈరోజు ఉదయం 10 గంటలకు అభిమాన సంఘాలతో సమావేశం కానున్నారు.  ఈ సమావేశం అనంతరం రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది.  వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రజినీకాంత్ వెల్లడించే ప్రకటన కీలకంగా మారనున్నది.