దర్బార్ ట్విట్టర్ టాక్ : అదరగొట్టిన రజిని 

దర్బార్ ట్విట్టర్ టాక్ : అదరగొట్టిన రజిని 

రజినీకాంత్ దర్బార్ సినిమా ఈరోజు థియేటర్లో సందడి చేస్తున్నది.  ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోలు ముగిశాయి.  సినిమా స్టార్టింగ్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుండటంతో రజిని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  సినిమాకు రేసి స్క్రీన్ ప్లే సూపర్ సక్సెస్ అయ్యినట్టు చెప్తున్నారు.  మురుగదాస్ సినిమాను సూపర్ స్టైలిష్ గా, తుపాకీ రేంజ్ లో తీశారని అంటున్నారు.  ఇక ఆదిత్య అరుణాచలంగా రజినీకాంత్ నట విశ్వరూపాన్ని చూపించినట్టు చెప్తున్నారు.  

సినిమాపై రజిని అభిమానులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదని, పాత రజినీకాంత్ ను చూపించారని అంటున్నారు.  రజినీకాంత్ సినిమా ఎలా ఉండాలని ప్రతి అభిమాని కోరుకున్నాడో ఆ అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందని ట్విట్టర్ ద్వారా చెప్తున్నారు.  సినిమాలో రజినీకాంత్ యాక్షన్ అదిరిపోయినట్టు తెలుస్తోంది.  ఫస్ట్ హాఫ్ సరదాగా, రొమాంటిక్ గా సాగితే ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయినట్టు చెప్పారు.  ఇక సెకండ్ హాఫ్ లో రజిని యాక్షన్ సూపర్ అని అంటున్నారు.  సెంటిమెంట్ వర్కౌట్ అయ్యినట్టు చెప్తున్నారు రజిని అభిమానులు.  మొత్తానికి రజినీకాంత్ తన మార్క్ హిట్ ను అందుకున్నారని మాత్రం చెప్పొచ్చు.