దర్బార్: రజిని టార్గెట్ రీచ్ అవుతాడా...!!?  

దర్బార్: రజిని టార్గెట్ రీచ్ అవుతాడా...!!?  

రజినీకాంత్ దర్బార్ సినిమా దూసుకుపోతున్నది.  సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగా పరుగుతులు తీస్తున్నది.  సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటుగా హిట్ టాక్ రావడంతో టికెట్స్ కోసం యూత్ పరుగులు తీస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా 7వేలకు పైగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతున్నది.  యూఎస్ లో మొదటిరోజే మిలియన్ డాలర్లు వసూళ్లు చేస్తుందని అంటున్నారు.  యూఎస్ లో రజినీకి స్ట్రాంగ్ మార్కెట్ ఉన్నది.  

ఒకవేళ మొదటిరోజే మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధిస్తే.. రాబోయే రోజుల్లో కనీసం 10 మిలియన్ డాలర్లు వసూళ్లు చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  ఇక ఇండియాలోనూ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.  తెలుగు రాష్ట్రాల్లో ఆశించినన్నీ థియేటర్లు దొరక్కపోయినా.. వసూళ్ల పరంగా మాత్రం సినిమా హైలైట్ అని అంటున్నారు.  మొదటి రోజు ఇండియాలో కనీసం  రూ. 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చెయ్యొచ్చని అంటున్నారు.  అటు విదేశాల్లో మరో రూ. 20 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.  అయితే, మొదటిరోజు వసూళ్లు కనీసం రూ. 100 కోట్లు వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  మరి ఈ టార్గెట్ ను రజిని దర్బార్ రీచ్ అవుతుందా చూద్దాం.