లాభాల బాటలో రజిని దర్బార్... 

లాభాల బాటలో రజిని దర్బార్... 

రజినీకాంత్ దర్బార్ సినిమా జనవరి 9 వ తేదీన రిలీజ్ అయ్యి మంచి విజయం సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్లో రిలీజైన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాకు ఆదరణ లభిస్తోంది. రజినీకాంత్ ఆదిత్య అరుణాచలంగా అద్భుతంగా నటించారు.  తమిళనాడులో ఈ సినిమా 800 థియేటర్లలో రిలీజ్ అయ్యింది.  మొదటి రోజు నుంచి సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.  10 రోజుల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.  పదిరోజుల్లో ఈ మూవీ తమిళనాడులో 100 కోట్లు సాధించింది.  ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 150 కోట్లు వసూలు చేసినట్టుగా లైకా ప్రొడక్షన్ సంస్థ పేర్కొన్నది. ఈ సినిమా హక్కులను ఒక్క తమిళనాడులు 60 నుంచి 80 కోట్ల వరకు విక్రయించారు.  దీన్ని బట్టి చూసుకుంటే ఈ మూవీ ఇప్పడు లాభాల బాట పడుతున్నట్టుగా అర్ధం చేసుకోవచ్చు.  చంగల్పట్టు, చెన్నై ఏరియాలో ఇప్పటికే సినిమాకు లాభాలు వస్తున్నాయి.  మొత్తానికి రజిని సినిమా చాలాకాలం లాభాలు రావడం విశేషం.