అక్కడ రజిని దర్బార్ స్పెషల్ షో రద్దు... కారణం విజయే...   

అక్కడ రజిని దర్బార్ స్పెషల్ షో రద్దు... కారణం విజయే...   

రజినీకాంత్ దర్బార్ సినిమా జనవరి 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  చాలాకాలం తరువాత దర్బార్ మూవీలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  భారీ ఫైట్స్ చేస్తున్నారు.  తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కాబోతున్నది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది.  

ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా కర్ణాటకలో పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.  అన్ని చోట్ల దర్బార్ స్పెషల్ షోలు వేస్తున్నారు.  కానీ, కర్ణాటకలోని క్రిష్ణగిరి, కావేరి పట్టణాల్లో స్పెషల్ షోలను రద్దు చేశారు.  దీనికి కారణం ఉన్నది.  విజయ్ బిగిల్ సినిమా స్పెషల్ షోల విషయంలో పెద్ద రచ్చ జరిగింది.  ఈ గొడవ కారణంగా థియేటర్ వద్ద అనేక ఇబ్బందులు పడ్డాయి.  ఆ రెండు చోట్ల ఈ సినిమా హీరోల సినిమాలు కూడా స్పెషల్ షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.