దర్బార్ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా? 

దర్బార్ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా? 

రజినీకాంత్ దర్బార్ సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  తమిళనాడులో ఈ సినిమాకు హంగామా ఇప్పటికే మొదలైంది.  చాలా సంస్థలు వారి స్టాఫ్ కు సెలవు ప్రకటించాయి.  టికెట్స్ పంచిపెడుతున్నారు.  తమిళనాడు తో పాటు అటు ముంబైలోని రజిని ఫీవర్ మొదలైంది.  

ఇక తెలుగు రాష్ట్రాల సంగతి చూసుకుంటే నగరాలు, పట్టణాల్లో ఈ సినిమాకు సంబంధించిన హంగామా ఇప్పటికే మొదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 14 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  రజినీకాంత్ గత సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సినిమాపై నమ్మకం అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  ఒకవేళ సినిమా హిట్ కొడితే... ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా వసూళ్ల పరంగా కూడా విజయం సాధిస్తుంది.