రజిని మానియా... వందకోట్ల క్లబ్ లో దర్బార్
రజినీకాంత్ దర్బార్ సినిమా దూసుకుపోతున్నది. రజిని సినిమా హిట్టయితే ఎలా ఉంటుందో తెలుసా... సునామి వస్తే సముద్రం ఎలా ఉగ్రరూపం దాల్చుతుందో, అలానే ఉంటాయి రజిని సినిమా కలెక్షన్లు. 70 సంవత్సరాల వయసులో 40 ఏళ్ళ యువకుడిగా రజిని చేసిన హంగామా అంతాఇంతా కాదు. రజిని సినిమా హిట్ అయితే ఇలానే ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు.
మొదటి రోజు రూ. 50 కోట్ల వరకు వసూళ్లు సాధించిన రజిని దర్బార్, రెండో రోజు కూడా అదే హవాను కొనసాగించింది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 100 కోట్లు క్రాస్ చేసింది. మొదటి రోజుకంటే రెండో రోజే వసూళ్లు అధికంగా ఉన్నాయట. ఇక పండగ సీజన్ కావడంతో రజిని దర్బార్ భారీ వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో నిన్న రిలీజైన తానాజీ, ఛపాక్ సినిమాలు వసూళ్ల పరంగా పెద్దగా సంచలనాలు లేకపోవడం రజినికి కలిసి వచ్చింది. బాలీవుడ్ లో ఈ రెండు సినిమాల కంటే కూడా దర్బార్ భారీ వసూళ్లు రాబడుతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)