ఆమె రజినీని వదలడం లేదుగా...!!

ఆమె రజినీని వదలడం లేదుగా...!!

రజినీకాంత్... నయనతార కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.  ఈ రెండు మంచి విజయాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఈ కాంబినేషన్లో మూడో సినిమా రాబోతున్నది.  చంద్రముఖి సినిమా తరువాత ఈ ఇద్దరు కలిసి దర్బార్ సినిమాలో నటించారు.  

ఈ మూవీ మంచి విజయం సొంతం చేసుకుంది. అనేక చోట్ల మంచి లాభాలు కూడా తెచ్చుకున్నది.  కాగా, ఇప్పుడు శివ దర్శకత్వంలో రజినీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు.  సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ కు జోడిగా మరలా నయనతారను తీసుకుంటున్నట్టు ప్రొడక్షన్ సంస్థ పేర్కొన్నది.  అజిత్ - శివ కాంబినేషన్లో వరసగా నాలుగు సినిమాలు వచ్చాయి.  ఈ నాలుగు కూడా మంచి విజయం సొంతం చేసుకున్నాయి.  ఇప్పుడు శివ - రజినీకాంత్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోంది.  ఈ ఏడాది దీపావళికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.