ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగుతున్న కేకేఆర్ 

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగుతున్న కేకేఆర్ 

ఐపీఎల్ 2020 లో ఈ రోజు 12 వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో టాస్ ఓడిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక రాజస్థాన్ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉండగా చివరి మ్యాచ్ గెలిచిన ఉత్సహం లో కేకేఆర్ ఉంది. మరి ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుంది. రాయల్స్ మూడో విజయంతో హ్యాట్రిక్ కొడతారా.. లేదా అనేది చూడాలి.

రాజస్థాన్ జట్టు : జోస్ బట్లర్ (w), స్టీవ్ స్మిత్ (c), సంజు సామ్సన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, జోఫ్రా ఆర్చర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, జయదేవ్ ఉనద్కట్

కేకేఆర్ జట్టు : శుబ్మాన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (w/c), ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, శివం మావి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, కమలేష్ నాగర్‌కోటి