రాజస్థాన్ హ్యాట్రిక్ విక్టరీ...

రాజస్థాన్ హ్యాట్రిక్ విక్టరీ...

వరుస విజయాలతో ఫ్లేఆప్ ఆశలను సజీవం చేసుకున్నట్టు కనిపించిన ముంబై ఇండియన్స్‌కి సొంత గడ్డపై ఎదురుదెబ్బ తగిలింది... తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు పోరాడి గెలిచారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. ఓపెనర్లు ముంబైకి శుభారంభాన్ని ఇచ్చారు. ఎవిన్‌ లూయిస్‌ 60 పరుగులు చేయగా... సూర్యకుమార్‌ యాదవ్ 38‌ రన్స్ చేశాడు... కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు.

ఇక కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాట్స్‌మన్స్‌ను కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్... బ్యాట్‌తోనూ సత్తా చాటారు... మరోసారి వీరవిహారం చేసిన బట్లర్ 53 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... కెప్టెన్ రహానె 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత శాంసన్‌తో కలిసి రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాడు బట్లర్... జట్టు ప్లేఆఫ్ అవకాశాలను పదిలం చేశాడు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు దాదాపు దూరమైనట్టే.