అతను లేకపోతే మాకు కోహ్లీ అవసరం లేదు...

అతను లేకపోతే మాకు కోహ్లీ అవసరం లేదు...

ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008 లో ప్రారంభించినప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) కోసమే ఆడుతున్నాడు. ఆ జట్టులో మొదట ఆటగాడిగా ఉన్న కోహ్లీ 2013 లో ఆ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 177 మ్యాచ్‌లాడిన కోహ్లీ 131.63 స్ట్రైక్‌రేట్‌తో 4,112 పరుగులు చేసాడు. ఇందులో ఐదు సెంచరీలతో పాటు 36 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) జట్టు మాత్రం మరొకరు కోహ్లీతో లేకపోతే వద్దు అనుకుంటుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సమయం నుండి అన్ని జట్లు అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నాయి. ఇక తాజాగా ఆర్ఆర్ కూడా అదే పని చేసింది. అయితే అందులో ఓ అభిమాని మీ జట్టులోకి కోహ్లీని ఆహ్వానిస్తారా..? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా... మేము కోహ్లీని మా జట్టులోకి తీసుకుంటాము. కానీ అతనితో పాటు ఆ జట్టు స్టాఫ్ మెంబర్ మిస్టర్ నాగాస్ వస్తేనే అని తెలిపింది. ఐపీఎల్‌లో ఆర్సిబి జట్టుని ప్రమోట్ చేసేవాళ్లలో నాగాస్ ఎప్పుడు ముందుంటాడు. అతని హెయిర్ స్టయిల్, మీసం, భాష అభిమానులను ఆకట్టుకుంటాయి.  ఇక టోర్నీ సమయంలో ఆటగాళ్లని నాగాస్ ఇంటర్వ్యూ చేస్తుంటాడు.