అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్.. చెన్నై ఖాతాలో మరో ఓటమి..
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానానికి చేరి ప్లేఆఫ్‌కు అవకాశాలు మెరుగుపర్చుకుంది. మరోవైపు చెన్నై ఈ ఓటమితో ఆఖరి స్థానంలో నిలిచింది. 126 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన రాజస్థాన్‌కు మంచి ఓపెనింగ్ దక్కలేదు. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టోక్స్, ఉతప్ప, శాంసన్.. తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్.. కెప్టెన్ స్మిత్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. స్మిత్ నిదానంగా ఆడగా.. బట్లర్ దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించాడు. వీరిద్దరి జోడి నాలుగో వికెట్‌కు 98 పరుగులు జోడించి రాజస్థాన్‌కు విజయాన్ని అందించారు.
ఇక, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. రాజస్థాన్ బౌలర్ల ధాటికి 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. సామ్ కరన్ , డుప్లెసిస్ , షేన్ వాట్సన్ అంబటి రాయుడు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజాతో కలిసి ధోనీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ధోనీ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికే ప్రయత్నించాడు. దూకుడుగా ఆడే సమయానికి ధోనీ రనౌటయ్యాడు. ఆఖర్లో జడేజా బౌండరీలు బాదడంతో చెన్నై 125 పరుగులు చేయగలిగింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)