ఐపీఎల్ 2020 : హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్... రాయల్స్ టార్గెట్..? 

ఐపీఎల్ 2020 : హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్... రాయల్స్ టార్గెట్..? 

ఈ రోజు ఐపీఎల్ 2020 లో అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు రాయల్స్ కు భారీ లక్ష్యానే ఇచ్చింది. అయితే మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబైని రాయల్స్ బౌలర్లు బాగానే కట్టడి చేసారు. కానీ 16 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసిన ముంబై 20 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అంటే కేవలం 4 ఓవర్లలోనే 74 పరుగులు రాబట్టింది. అయితే మ్యాచ్ ఒక్కసారిగా ఇలా మారడానికి హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్సే కారణం. పాండ్యా కేవలం 21 బంతుల్లో 7 సిక్స్ లు, రెండు ఫోర్ల సహాయంతో 60 పరుగులు బాదేశాడు. అందులోనూ 17,20 ఈ రెండు ఓవర్లలోనే 54 పరుగులు సాధించాడు. అయితే రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ రెండేసి వికెట్లు తీయగా కార్తీక్ త్యాగి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే రాయల్స్ 196 పరుగులుచేయాలి. అయితే ఈ జట్టులోను భారీ హిటర్లు ఉన్నారు. చూడాలి మరి ఎవరు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారు అనేది.