ఐపీఎల్ 2020  : చెన్నైని వణికించిన రాజస్థాన్‌ బౌలర్లు..  

ఐపీఎల్ 2020  : చెన్నైని వణికించిన రాజస్థాన్‌ బౌలర్లు..  

 ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అబుదాబి వేదికగా  ఈ రోజు మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే చెన్నై బ్యాట్స్మెన్స్ ను రాయల్స్ బౌలర్లు బాగానే కట్టాడు  చేసారు. చెన్నై జట్టులో జడేజా చేసిన 35 పరుగులే ఆ జట్టు తరపున ఓ ఆటగాడు అత్యధిక పరుగులు. జట్టు టాప్ ఆర్డర్ మొత్తం విఫలం కావదంతి చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లు రాహుల్ తివాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో రాయల్స్ విజయం సాధించాలంటే 126 పరుగులు చేయాలి. అయితే చెన్నై జట్టులో ఇంత తక్కువ పరుగులను కాపాడే బౌలింగ్ లేదు అనే చెప్పవచ్చు. అయితే పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఈ రెండు జట్లలో ఎవరి విజయం సాధిస్తే వారికి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరి ఈ లక్ష్యాన్ని ఛేదించి రాజస్థాన్ గెలుస్తుందా.. లేదా అనేది చూడాలి.