ముంబై పై కొత్త రికార్డు సృష్టించిన రాజస్థాన్...

ముంబై పై కొత్త రికార్డు సృష్టించిన రాజస్థాన్...

ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్టోక్స్‌ సెంచరీకి తోడు శాంసన్‌ అర్ధసెంచరీతో.. ముంబై పెట్టిన 196 రన్స్‌ టార్గెట్‌ను ఈజీగా ఛేజ్‌ చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. ఇది రాజస్తాన్‌ కు ఐదో విజయం కాగా, ముంబైకు నాల్గో ఓటమి. బలమైన ముంబై జట్టుపై రాయల్స్ అద్భుత విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే ముంబై జట్టు పై రాయల్స్ రికార్డు సృష్టించింది. అదేంటంటే... ఇప్పటివరకు ఐపీఎల్ లో ముంబై జట్టుకు వ్యతిరేకంగా అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా రాజస్థాన్ నిలిచింది. ఇంతకముందు ఈ రికార్డు 2018 సీజన్ లో ముంబై పై 195 పరుగులను చేధించిన ఢిల్లీ పేరిట ఉంది. కానీ ఇప్పుడు ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను స్టోక్స్‌-శాంసన్‌ 152 పరుగుల భాగసామ్యం కారణంగా రాజస్థాన్ సునాయాసంగా ఛేదించింది. బెన్‌ స్టోక్స్‌ 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 107 రన్స్‌ చేశాడు.  సంజూ శాంసన్‌  31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లతో 54 రన్స్ కొట్టాడు. వీరిద్దరూ చెలరేగిపోవడంతో రాజస్తాన్‌ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.