ఐపీఎల్ ముంగిట రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద షాక్ ..

ఐపీఎల్ ముంగిట రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద షాక్ ..

ఐపీఎల్ ముంగిట రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టోక్స్ ఈ సీజన్‌లో ఆడటం అనుమానమేనని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా అన్నారు. గత ఏడాది ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచ కప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్.. అగస్టులో పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టు ముందు జట్టు నుంచి వైదొలగాడు. న్యూజీలాండ్‌లో ఉంటున్న తన కుటుంబ సభ్యుల దగ్గరకు స్టోక్స్ వెళ్లిపోయాడు. స్టోక్స్ తండ్రి ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. 'అతను ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతడు కుటుంబ సభ్యులతో ఉండటానికే మొగ్గు చూపుతున్నాడు. అతని అవసరం ఎంతో ఉంది. స్టోక్స్‌కు మరింత సమయం ఇవ్వాలని అనుకుంటున్నాము. ఐపీఎల్‌కు రమ్మని మేం ఒత్తిడి చేయబోము. అతడే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' అని కోచ్ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు.