రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు భారీ జరిమానా..

రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు భారీ జరిమానా..

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు ఐపీఎల్‌ పాలక మండలి రూ.12 లక్షల జరిమానా విధించింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఈ ఫైన్‌ విధించింది. ఇప్పటికే ఈ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌కు ఇదే తరహాలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా పడింది. కాగా...నిన్న రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ గెలిచి హాట్రిక్ విక్టరీని సొంతం చేసుకుంది.  రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది.  194 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ముంబై బౌలర్ల ధాటికి రాజస్థాన్‌ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో రాజస్థాన్‌ ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్‌ స్మిత్‌కు జరిమానా వేయడం గమనార్హం.