ఆర్ఆర్ ప్రతిమ్యాచ్ గెలవాల్సిందే: బెన్‌స్టోక్స్

ఆర్ఆర్ ప్రతిమ్యాచ్ గెలవాల్సిందే: బెన్‌స్టోక్స్

అబుదబీ: ఐపీఎల్-2020 దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిరోజు ఉత్కంఠమైన మ్యాచ్‌లతో ప్రేక్షకులకు వెర్రెక్కిస్తోంది. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, నెంబర్ వన్ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లేఆఫ్‌కు చేరే ఆశలను నిలుపుకుంది. అయితే ప్లేఆఫ్‌కు వెల్లేందుకు ఇంకెన్ని మ్యాచులు గెలవాలని ఆర్ఆర్ అభిమానులు లెక్కలు కడుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టిక్కలో ఆరో స్థానంలో ఉంది. ముంబైతో జరిగిన మ్యచ్‌లో మ్యన్ ఆఫ్ ది మ్యాచ్‌ను అందుకున్న బెన్ స్టోక్స్ తమ జట్టు విజయాలపై మాట్లాడాడు. ముంబై లాంటి జట్టు ఓడించడం మనకు నమ్మకాన్ని పెంచుతుంది. ముంబై 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే అంటూ చెప్పుకొచ్చాడు. ‘ముంబై వంటి మంచి జట్టును ఓడించడం చాలా గోప్ప విచయం. దాని వల్ల మనలోని నమ్మకం మరింత ఎక్కవవుతుంది. అంతేకాకుండా మేము మొదటి రెండు మ్యాచులు గెలస్తామని అనుకోలేదు. నేను ఇప్పటికీ అది నమ్మలేక పోతున్నా. అయితే ఇప్పడు ప్లేఆఫ్‌కు చేరాలంటే ఆడబోయే ప్రతీ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంద’ని అన్నాడు. తరువాత అక్టోబరు 30న రాజస్థాన్ జట్టు అబుదాబి షేక్ జాయేద్ మైదానంలో పంజాబ్‌తో తలపడేందుకు సన్నద్దమవుతుంది.