మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

జైపూర్: కరోనాను అదుపుచేసేందుకు మరో రాష్ట్రం నైట్ కర్ఫ్యూను అమలు చేసింది. తొలుత మధ్యప్రదేశ్ నైట్ కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  అయితే మధ్యప్రదేశ్ 5 జిల్లల్లో నైట్ కర్ఫ్యూ విధించింది. ఇప్పుడు కరోనాను నియంత్రించేందుకు రాజస్థాన్ కూడా అదే బాటలో నడవనుంది. రాజస్థాన్‌లో మొత్తం 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. క్యాబినెట్ సమావేశం తరువాత ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలిపింది. జైపూర్, జోద్‌పుద్, కోటా, బికనెర్, ఉదైపుర్, అజ్మర్, అల్వార్, భిల్వారాలలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. ‘రాష్ట్రంలో కరోనాను నియంత్రించేందుకు మంత్రులందరూ సమావేశం అయ్యాం. రాష్ట్రంలో ఎక్కవగా కరోనా కేసులు నమోదైన జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నాం. మొత్తం 8 జిల్లాల్లో ఈ కర్ఫ్యూ విదించనున్నాం. దీంతో పాటుగా మరిన్ని నిర్ణయాలు తీసుకున్నామ’ని రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే ఫంక్షన్‌లకు వెల్లే వారు, బస్సు లేదా ట్రైన్ ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లే వారు, మరికొన్ని అవసరాల కోసం బయటకు వచ్చే వారు నేటి రాత్రి వరకు రావచ్చని ఆయన తెలిపారు. అయితే రాష్ట్రంలో రోజుకి 1,700 నుంచి 3,000 వరకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, వాటిని నిలువరించేందుకే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఎనిమిది జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుందని తెలిపారు.  అయితే ఇటీవల రాజస్థాన్‌లె మాస్క్ ధరించడం తప్పని సరి అని, మాస్క్ లేకుండా ఉన్నవారికి రూ.200 నుంచి రూ.500 వరుకు జరిమానాను ఖరారు చేశారు. అయితే ఈ కర్ఫ్యూ కరోనాను ఎంతవరకూ నిలువరిస్తుందంటూ కొందరు సందేహాలు వెల్లడిస్తున్నారు.