అయోధ్య మందిర నిర్మాణంలో "పింక్ స్టోన్" వాడకంపై నిషేధం..!

అయోధ్య మందిర నిర్మాణంలో "పింక్ స్టోన్" వాడకంపై నిషేధం..!

అయోధ్య రామ మందిర నిర్మాణంలో పింక్ స్టోన్ వాడకంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాజస్థాన్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. మందిర నిర్మాణం పేరుతో పింక్ స్టోన్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు.  బన్షీపహర్ పూర్ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అయితే ఎవరికీ పింక్ స్టోన్ తవ్వకాలకు అనుమతివ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు 20 ట్రక్కుల పింక్ స్టోన్ ను అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దాంతో ఈ విషయాన్ని రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సాధారణంగా ఆలయ నిర్మాణంలో పింక్ స్టోన్ వాడటం పరిపాటి..కానీ మందిర నిర్మాణంలో ఉపయోగిస్తామని చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారు.