నిద్రలేని రాత్రులు గడుపుతున్న రాజమౌళి.. కారణం తెలిస్తే షాక్..

నిద్రలేని రాత్రులు గడుపుతున్న రాజమౌళి.. కారణం తెలిస్తే షాక్..

టాలీవుడ్‌లో జక్కన్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి వంటి అద్భుతం తెరెకెక్కించడంతో అతడి పేరు ఇప్పుడు దేశమంతటా సుపరిచిత మయింది. ప్రస్తుతం రాజమౌళి రాంచరణ్, ఎన్‌టీఆర్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే రాజమౌళి ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడని ఆర్ఆర్ఆర్ టీం చెప్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, వాటితో పాటు పలుదేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతున్నాయి. దాంతో జక్కన్న వాటన్నింటిని జాగ్రత్తగా పరిశీలించేందుకు అతడు తన నిద్రను కూడా పక్కన పెట్టాడట. కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ప్రతి సీన్‌ను ఒకటి పదిసార్లు చూసుకుంటూ కావలసిన మార్పులను చేయిస్తున్నాడు. అంతేకాకుండా సినిమా చిత్రీకరణలో విదేశీయులు పాల్గొంటుండటంతో రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. వాటిని పుకార్లుగానే మిగల్చాలన్న పట్టుదలతో ఈ సినిమాను దసరాకు తీసుకొచ్చేందుకు జక్కన్న, ఆర్ఆర్ఆర్ టీం తెగ కష్టపడుతున్నారు. మరి ఈ కష్టం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.