చెన్నైలో భారీ వర్షం

చెన్నైలో భారీ వర్షం

చెన్నై: తమిళనాడుకు తుఫాను పొంచి ఉండగా చెన్నైలో భారీ వర్షం కురుసింది. అయితే నవార్ తుఫాను కరైకల్ మీదగా తమిళనాడుకు బుధవారం సాంయంత్రానికి తుఫాను చేరే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో చెన్నైలో భారీ వర్ష కురవడంతో ప్రజలలో కలవరపాటును కలిగిస్తోంది. ఐఎండీ ప్రకారం బంగాళాకాతంలోని అల్పపీడనం గంటకి 5కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. అయితే ఈ అల్పపీడనం 10.0 డిగ్రీల లాటిట్యూడ్‌ ఉత్తరంలో, అలాగే తూర్పున 83.0 డిగ్రీల లాటిట్యూడ్‌తో ఉంది. అయితే ఇది పుదుచ్చేరీకి 410 కిలోమీటర్ట తూర్పు-ఆగ్నోయంగాను 450 కిలోమీటర్ల ఆగ్నేయంగా ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. మరో 12 గంటల్లో ఉత్తరం-వాయువ్య దిశలకు చేరుతుందని తెలిపారు. తుఫాను నవంబరు 25నాటికి తమిళనుడు-పుదుచ్చేరీ రేవులను దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ తుఫాను గంటకు 100-110 కిలోమీటర్ల గాలులతో ఉంటుందని, ఇంకా దారు స్థితి ఏర్పడితే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. అంతేకాకుండా దక్షిణ ఆంధ్రాలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. నవంబరు 25-26 తారీకులలో రాయలసీమను తుఫాను తీకవచ్చని తెలిపారు.