చల్లటి కబురు : ఏపీలో రెండు రోజులు వర్షాలు

చల్లటి కబురు : ఏపీలో  రెండు రోజులు వర్షాలు

సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సైక్లోనిక్ సర్క్కులేషన్ ఇప్పుడు జార్ఖండ్  నుండి  ఛతీస్ ఘఢ్ మరియు తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు వ్యాపించి ఉన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.   

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం విషయానికి వస్తే..  ఈ రోజు రేపు, మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల  తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు  దక్షిణ కోస్తా ఆంధ్ర లో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.      రేపు ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే  అవకాశం ఉంది.  మరియు ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ   తెలిపింది.

రాయలసీమ: ఈరోజు రేపు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే  అవకాశం ఉందని.. ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.   

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఈ రోజు తెలంగాణాలో తేలికపాటి వర్షములు, ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. తదుపరి రెండు రోజులు (19,20వ.తేదీలు)   పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.