రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌... ఇక, ఆ బాధ తప్పినట్టే..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌... ఇక, ఆ బాధ తప్పినట్టే..

రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ముందుకొచ్చింది. ఇక నుంచి బ్యాగేజీని ప్రయాణికులు వెంట మోసుకెళ్లకుండా... ఆ పనిని రైల్వేనే చేయనుంది. నామమాత్రపు ఫీజుతోనే ఈ సేవలను అందించనున్నట్టు ప్రకటించింది రైల్వేశాఖ... మొదటగా ఈ సేవలను ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్‌ రైల్వే స్టేషన్లలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు రైల్వే అధికారులు.. ఇందుకోసం 'బ్యాగ్స్ ఆన్ వీల్స్' అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా తీసుకురానుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులిద్దరికీ ఈ యాప్ అందుబాటులో ఉండనుంది. దేశంలో ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. తమ ప్రయాణాల్లో బ్యాగులు మోయడం ప్రయాణికులకు కష్టమైన పని.. రైల్వే శాఖ తీసుకొస్తున్న ఈ కొత్త యాప్‌తో ప్రయాణికుల ఇంటి నుంచి రైల్వేస్టేషన్‌ వరకు లగేజీని వాళ్లే తీసుకెళ్తారు.. ఇది ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌గా చెప్పాలి.