ఫిట్నెస్ పరీక్షల్లో ఫెయిల్ భారత ఇద్దరు ఆటగాళ్లు
ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. ఐతే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు జట్టులోకి వచ్చే ముందు తప్పనిసరిగా ఫిట్నెస్ టెస్టులో పాస్ కావాల్సి ఉంటుంది. ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో తెవాటియా, చక్రవర్తి ఫెయిల్ అయినట్లు తెలిసింది. దీంతో వీరిద్దరూ రాబోయే టీ20 సిరీస్‌లో పాల్గొంటారా లేదా అనేది సందేహంగా మారింది. ఫిట్నెస్ పరీక్షలో శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, టి. నటరాజన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌తో సహా మొత్తం 30 మంది క్రికెటర్లు పాల్గొన్నారు. బీసీసీఐ కొత్త సెలక్షన్ రూల్స్ ప్రకారం.. సెలక్షన్‌కు పరిగణనలోకి తీసుకోవాలంటే రెండు ఫిట్నెస్ ప్రమాణాల్లో ఒకదాన్ని తప్పనిసరిగా క్లియర్ చేయడం ఆటగాళ్లకు తప్పనిసరి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)