రాహుల్ హార్ట్ బ్రేక్‌కు కారణం ఆమె కాదట

రాహుల్ హార్ట్ బ్రేక్‌కు కారణం ఆమె కాదట

రాహుల్ సిప్లిగంజ్ ఈ పేరు అందరికి సుపరిచితమే. ఇతడు హీరో కాదు, విల్లన్ కాదు, ఆఖరికి అసలు నటుడే కాదు, అతడొక సింగర్. కానీ తన ప్రతిభతో ఎన్నో పాటలకు తన గాత్రంతో ఆయువు ఊదాడు. అయితే ఇటీవల రాహుల్ చేసిన హార్ట్ బ్రెక్ పోస్ట్ సోషల్ దుమారం లేపింది. దానికి తోడుగా అదే సమయానికి పనర్నవి తనకు ఎంగేజ్‌మెంట్ అన్న రీతిలో పోస్ట్ చేయడం రెండు బాగా సింక్ అవ్వడంతో నేటిజన్లందరు ఒక నిర్ణయానికి వచ్చారు. పునర్నవినే రాహుల్ హార్ట్ బ్రేక్ చేసిందని, సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తీరా చూస్తే పునర్నవి తన వెబ్ సిరీస్ ప్రమోషన్‌కు ఆ పోస్ట్ చేసినట్లు తెలిసింది. అయితే ఇక్కడ పున్ను ఫొటోకు క్లారిటీ వచ్చింది. మరి రాహుల్ హార్ట ఎందుకు బ్రేక్ అయిందనేది మాత్రం సీక్రెట్ గానే ఉంది. ఎట్టకేలకు ఈ చిక్కుముడిని రాహులే విప్పాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ తన హార్ట్ బ్రేక్‌కు అసలు కారణం తెలిపి అభిమానుల పైనుంచి కొండంత భారం దించాడు. తన హార్ట్‌బ్రేక్‌కు పున్నుకు ఎటువంటి సంబంధం లేదని తేల్చాడు. తన హార్ట్ బ్రేక్‌కు కారణం తన ఆర్థిక ఇబ్బందులని చెప్పాడు. వివరాల్లోకి వెళితే రాహుల్ తన టీమ్ ఓ పాటను నిర్మించింది. దానికోసం దాదాపు రూ.58 లక్షలు ఖర్చయ్యాయి. అందులో రూ.28 లక్షలు తనవి ఉన్నాయి. అయితే తీరా చూస్తే ఆపాట భారీగా విఫలమయిందని, దాంతో తన డబ్బుపోవడంతో ఎంతో నిరుత్సాహపడ్డానని అందుకనే హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టానని చెప్పాడు.