భారీ ప్యాకేజీలు అవసరం..రాహుల్‌లో అభిజిత్‌ బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్‌

 భారీ ప్యాకేజీలు అవసరం..రాహుల్‌లో అభిజిత్‌ బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్‌

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లాక్‌డౌన్ సమాయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు...దేశ ఆర్థిక వ్యవస్థపై రోజుకో ఆర్థికరంగ నిపుణుడిలో వీడియోకాన్ఫరెన్స్‌లో చర్చలో పాల్గొంటున్నారు..దేశంలో కరోనా ప్రారంభ దశలోనే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు..ప్రభుత్వానికి,ప్రజలకు ఎప్పటి కప్పుడు సూచనలు చేస్తూ...
ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అనుసరించాల్సిన అంశాలపై మంగళవారం ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్‌ లో ద్వారా కీలక అంశాలపై చర్చించారు.. భారత్‌లో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు భారీస్థాయి ఉద్దీపన పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరముందని అభిజిత్‌ బెనర్జీ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుదేలైన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన పలు కీలక అంశాలు పంచుకున్నారు..

దేశంలో డిమాండ్‌ పుంజుకోవాలంటే ప్రజల చేతుల్లోకి డబ్బు వచ్చే మార్గాలు ఎంచుకోవాలని సూచించారు...

దేశంలో ఉద్యోగకల్పనకు కీలకంగా మారిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరముందని అభిజిత్‌ బెనర్జీ అన్నారు...
భారత్‌ ఇంకా భారీ ఉద్దీపనకు సిద్ధం కాలేదని, జీడీపీలో ఒకశాతంపైనే ఇంకా చర్చ జరుగుతున్నదని అన్నారు... అదే అమెరికాలో జీడీపీలో 10శాతం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారనిగుర్తుచేశారు...పేదలకు అందేలా..ఆర్థికంగా కిందిస్థాయిలో ఉన్న 60శాతం ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల ఎలాంటి దుష్పపరిణామాలు ఉండవని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

కేంద్రం మరింత చొరవ తీసుకొని వలస కార్మికుల తరలింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉందని అభిజిత్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని, బాధ్యత అంతా రాష్ట్రాలపైనే వేసే ఆలోచన కాకుండా, కేంద్రం తనవంతు బాధ్యత తీసుకోవాలని అన్నారు.

గత వారంలో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ప్రఖ్యాత ఆర్థికవేత్త, రఘురామ్ రాజన్‌ తో కూడా  వీడియోకన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు...పేదలకు సహాయం చేయడానికి ఎంత డబ్బు అవసరం అని రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు… తక్షణ సంక్షేమం కోసం రూ .65,000 కోట్లు అవసరమని, ఇది పేదల ఆకలి దప్పులు తీర్చడం కోసం మాత్రమే ఖర్చు చేయాలని రఘురామ్ రాజన్ సమాధానం ఇచ్చారు...దీర్ఘకాలిక లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థ అంత మంచిది కాదని సూచించారు. అంతేకాక “లాక్‌డౌన్ ఎత్తివేయడంలో ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించాలని, కోట్లాది మంది జనాభా కలిగిన. భారతదేశంలో, ఎక్కువ కాలం ప్రభుత్వాలు ప్రజలకు ఆహార సదుపాయాలు కల్పించగలిగే సామర్థ్యంతో లేవని, కరోనా ఉన్నవారిని ఎప్పటికప్పుడు గుర్తించి వారిని ఐసోలేషన్ ద్వారా వేరుచేసి అంచలంచెలుగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ఆయన సూచించారు.