దేశంలో ఏపీ భాగం కాదా?: రాహుల్‌

దేశంలో ఏపీ భాగం కాదా?: రాహుల్‌

భారత దేశంలో ఆంధ్రప్రదేశ్‌ భాగం కాదా? ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను మోడీ నిలబెట్టుకోరా? ఇటువంటి ప్రధాని దేశానికి అవసరమా? అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు రాహుల్‌ సంఘీ భావం ప్రకటించారు. ఏపీ భవన్‌లోని దీక్ష వేదిక వద్దకు వచ్చి బాబుకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయనమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రధానమంత్రి పాలనలో దేశం ఉండటం అత్యంత దురదృష్టకరమని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం నిమిషాల్లో జరుగుతుందని హామీ ఇచ్చారు.  ప్రధాని చౌకీదార్‌ చోర్‌గా మారారని విమర్శించారు. ప్రధాని ఎక్కడికెళ్లినా అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. ఏపీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బును అనిల్ అంబానీ ఖాతాలోని మళ్లించారని ఆరోపించారు. మోడీకి మరోసారి ప్రధాని అయ్యే అర్హతలేదన్న రాహుల్‌.. మరో రెండు నెలలో ఆయన ఆ హోదాలో ఉండబోతున్నారని చెప్పారు.