తాప్సి డెడికేషన్‌కు ఇంప్రెస్ అయ్యా..

తాప్సి డెడికేషన్‌కు ఇంప్రెస్ అయ్యా..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హిందీ, తెలుగు, తమిళం. ఇలా భాషలతో సంబంధం లేకుండా ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి సంబంధించి ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు రూపొందాయి. తాజాగా ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత నేపథ్యంలో చిత్రం రూపొందుతుంది. ఆమె జీవితాన్ని వెండితెరపైకి వయాకామ్ 18 సంస్థ  తీసుకురానుంది . మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తుంది.. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. "శభాష్ మిథు" పేరుతో చిత్రం విడుదల కానుంది. లాక్‌డౌన్‌ సమయాన్ని వృధా చేయకుండా తాప్సి క్రికెట్‌లో మెలకువలు నేర్చుకుంది. దీంతో డైరెక్టర్‌ రాహుల్‌ ఢోలాకియా తాప్సి డెడికేషన్‌కు ఇంప్రెస్‌ అయ్యానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాప్సి వృత్తిపట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి. తన పాత్ర కోసం శిక్షణను ప్రారంభించింది. శిక్షణ కోసం మాకు కోచింగ్‌ స్టాఫ్‌ ఉన్నారు. అయితే లాక్‌డౌన్‌ తో మార్చి నెలాఖరులో షురూ కావాల్సి ఉండగా..లాక్‌డౌన్‌తో ఏమి చేయలేకపోయాం అని అన్నారు.