రివ్యూ: రాహు 

రివ్యూ: రాహు 

నటీనటులు: అభిరాం వర్మ, కృతి గర్గ్, సుబ్బు వేదుల  

మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు 

నిర్మాత: ఏవీఆర్ స్వామి 

దర్శకత్వం: సుబ్బు వేదుల 

రాహు అంటే చాలామంది నెగెటివ్ గా ఆలోచిస్తారు.  ఏ పని చేయాలి అన్నఆ రాహుకాలం చూసుకొని చేస్తుంటారు.  ఆ సమయంలో ఎటువంటి పనులు చేసినా సరిగా జరగవని అంటుంటారు.  ఈ నెగెటివ్ టచ్ ఉండే టైటిల్ తో సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు.  దానికి ధైర్యం కావాలి.  అంతకు మించి కథపై నమ్మకం ఉండాలి. సురేష్ ప్రొడక్షన్ వంటి సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై నమ్మకం ఏర్పడింది. మరి ఆ నమ్మకాన్ని రాహు నిలబెట్టుకుండా చూద్దాం. 

కథ: 

సుబ్బు వేదుల పోలీస్ ఆఫీసర్.  అయన కూతురు కృతికి చిన్నతనం నుంచి కన్వెర్షన్ డిజాస్టర్ తో బాధపడుతూ ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ కు గురైనపుడు ఆమె చూపును కోల్పోతుంది.  దీంతో ముందు ఏమున్నదో తెలియదు.  స్ట్రెస్ ఫ్రీ కాగానే తిరిగి మాములుగా మారిపోతుంది.  ఇదే సమయంలో అభిరాం వర్మతో ప్రేమలో పడుతుంది కృతి.  అయితే, అభిరామ్ కు రాహు దోషం ఉన్నది.  అభిరాం ను పెళ్లి చేసుకుంటే 30 రోజుల్లో మరణిస్తాడని జ్యోతిష్యుడు చెప్తాడు.  దీంతో సుబ్బు వారి పెళ్ళికి నిరాకరిస్తాడు.  కానీ అభిరామ్ ప్రేమించిన అమ్మాయి కృతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. 30 రోజుల తరువాత ఇంట్లో చెప్పొచ్చు అనుకుంటారు.  అదే సమయంలో కృతి కిడ్నాప్ అవుతుంది.  అక్కడి నుంచి తప్పించుకొని కాలకేయ వద్దకు చేరుతుంది.  కాలకేయకు, కృతి తండ్రి పోలీస్  ఆఫీసర్ సుబ్బుకు గొడవలు ఉంటాయి.  కృతి మేడలో ఉన్న లాకెట్ ను చూసి ఆమె సుబ్బు కూతురు అని గుర్తు ఆడతాడు.  ఆ తరువాత ఏమైంది... ? కృతి కాలకేయ చెర నుంచి బయటపడిందా? అసలు ఇందులో విలన్ ఎవరు ? కృతిని కిడ్నాప్ చేసింది ఎవరు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

 సినిమాలోని పాయింట్ కొత్తగా ఉండటంతో పాటుగా థ్రిల్ ను కలిగించేందుకు ఎక్కువ స్కోప్ ఉండటంతో దర్శకుడు కథను అంతే  థ్రిల్ ను  కలిగించేలా రాసుకున్నాడు.  కానీ, తెరపై దాన్ని ప్రజెంట్ చేయడంలో కొంచం తడబడినట్టుగా అర్ధం అవుతున్నది.  ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడక్కడా కామెడీ, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో రన్ చేశారు.  ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి.  ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్లస్ అయ్యింది.  హీరోయిన్ కాలకేయకు ఎదురు పడే సీన్ తో  ఇంటర్వెల్ వేశారు.  

అక్కడి నుంచి సెకండ్ హాఫ్ లో  ఏమౌతుంది అనే లీడ్ ఇస్తూ ఆసక్తి కలిగిచే విధంగా చూపించే అవకాశం ఉంటుంది. అదే విధంగా సెకండ్  హాఫ్ లో అసలు విలన్ ఎవరు అని చూపించి ట్విస్ట్ ఇచ్చాడు.  అతని నుంచి హీరోయిన్ తప్పించుకోవాలని అనుకోవడం, ఆమెను పట్టుకోవాలని విలన్ అనుకోవడంతో సీన్స్ సాగుతుంటాయి.  ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త బోర్ కొట్టేవిధంగా ఉంటాయి.  సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ కలిగించే అంశాలు చాలా ఉన్నా వాటిని సరిగా డీల్ చేయలేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు.  

ఎవరెలా చేశారంటే : 

ఈ సినిమా కోసం చాలా రోజులు యూనిట్ కష్టపడింది.  ఆ కష్టం సినిమాలో కనిపించినా, కథను నడిపిన తీరులో కొన్ని లోపాలు ఉండటం సినిమాకు కలిసిరాలేదని చెప్పాలి.  ఇందులో అభిరామ్ వర్మ పర్వాలేదనిపించారు.  ఇక హీరోయిన్ కృతి స్కిన్ షో తో పాటు నటన పరంగా కూడా మెప్పించింది.  సినిమాలో కృతి హీరోయిన్ అయినప్పటికీ ఆమె సినిమాకు హీరోగా నడిపించింది.  ఇక సత్యం రాజేష్ తన పాత్ర మేరకు మెప్పించాడు.  

సాంకేతికవర్గం పనితీరు: 

దర్శకుడిగా సుబ్బుకు ఇది తొలి సినిమా అయినప్పటికీ కథను రాసుకున్న తీరు బాగుంది.  కానీ, ఆ కథను నడిపించిన విధానం అనుభవం లేమి కారణంగా తడబడినట్టుగా కనిపించింది.  లక్కరాజు ప్రవీణ్ సంగీతం పర్వాలేదు.  

పాజిటివ్ పాయింట్స్: 

హీరోయిన్ కృతి 

మైనస్ పాయింట్స్: 

కథనం 

దర్శకత్వం 

చివరిగా: రాహు: థ్రిల్లింగ్ సినిమాలు మెచ్చేవారికి మాత్రమే.