యువ క్రికెటర్లు రాణించడంలో ద్రవిడ్ దే ప్రధాన పాత్ర : రహానే
టీం ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అడిలైడ్ టెస్టులో టీం ఇండియా 36 పరుగులకే కుప్పకూలిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తనకు ఫోన్ చేశారని, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పాడని రహానే తెలిపాడు. అయితే యువ క్రికెటర్లు అంచనాలకు మించి రాణించడంలో రాహుల్ ద్రవిడ్ ప్రధానపాత్ర పోషించాడని రహానే చెప్పాడు. భారత్ ఏ టీంతోపాటు అండర్-19 జట్లకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో చివరి మూడు టెస్టులకు రహానే కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. అడిలైడ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో టీం ఇండియా ఓడిపోయింది. కోహ్లీ లేకపోవడంతో పాటు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా యువ క్రికెటర్ల అద్భుత ఆట తీరుతో సిరీస్ను భారత్ 2-1 తో గెలుపొందింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)