పోట్లాడుకున్న రాగిణి ద్వివేది, సంజనా

పోట్లాడుకున్న రాగిణి ద్వివేది, సంజనా

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో తీగ లాగితే టాలీవుడ్ వరకు డొంక కదులుతుంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియాచక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . అలాగే కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది ,  సంజనా గల్రానీ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రియా చెప్పిన పేర్లలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉండటంతో ఇప్పుడు టాలీవుడ్ కు డ్రగ్స్ సెగ తగులుతుంది.  ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో ఇరుకొవడానికి కారణం నువ్వంటే నువ్వంటూ శాండల్ వుడ్ హీరోయిన్స్ రాగిణి , సంజనాలు వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మడివాడ మహిళా సంరక్షణ పునర్వసతి కేంద్రంలో ఉన్న రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు పరస్పరం బాహాబాహీకి దిగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు ఇద్దరు నోరుమెదపకుండా ఉన్నపటికీ ఇప్పుడు ఒకరినొకరు దూషించుకున్నటు తెలుస్తుంది. ఇదిలా ఉంటే యూరిన్ టెస్ట్ కోసం వైద్యులు రాగిణిని శాంపిల్  కోరగా ఆమె నీళ్లను నింపి ఇచ్చిందట . దాంతో అధికారులు , వైద్యులు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మహిళా కానిస్టేబుల్ ను పంపి, మరోసారి యూరిన్ శాంపిల్స్ సేకరించారు.