ముఖ్యమంత్రిని ఊహాలోకంలోకి తీసుకెళ్తున్నారు !

ముఖ్యమంత్రిని ఊహాలోకంలోకి తీసుకెళ్తున్నారు !

హై కోర్టులో స్టేటస్ కో పొడిగించడం మంచి పరిణామని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామా కృష్ణం రాజు పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవడం మంచిది కాదని అన్నారు. అమరావతి రైతులకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని, అమరావతి విషయంలో జగన్ మనసు కరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. రైతుల ఆక్రందనలు జగన్ చెవిన పడతాయనుకుంటున్నానన్న ఆయన జగన్ పట్టించుకోకపోయినా, న్యాయస్థానంలో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. 

న్యాయస్థానాలను, న్యాయ మూర్తులను కించపరిచిన ప్రశాంత్ భూషణ్ కి శిక్ష పడబోతుందని, రాష్ట్రంలో న్యాయమూర్తులను దుర్భాష లాడుతున్నవారిని కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.  న్యాయమూర్తులను కించపరిచే వారికెవరికైనా శిక్ష పడుతుందిని అన్నారు. నాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దేవేందర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిని ఊహాలోకం లోకి తీసుకువెళ్తున్నారని, ముఖ్యమంత్రి వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి రావాలని అన్నారు. రచ్చబండ, ప్రజా దర్బార్ నిర్మావహిస్తామన్నారు కానీ చేయడం లేదని, ముఖ్యమంత్రి పై ప్రేమతో ముష్టి యుద్దాలు కూడా జరుగుతున్నాయని వాటిపై దృష్టి పెట్టండని అన్నారు.

రాష్ట్రం వద్ద నిధులు లేవు..నిధులు కేంద్రమే ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తుంది..!?అని ఆయన ప్రశ్నించారు. “ప్రధాన మంత్రి ఆవాస్ యోజన” కింద ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల డబ్బు కేంద్రం జమ చేసిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకపోవడం సరికాదని డబ్బు లేకుండా మూడు రాజధానులు ఏవిధంగా సాధ్యమవుతుందో చెప్పాలని అన్నారు. ఒక్క రాజధాని నిర్మాణానికే డబ్బు లేదు..మూడు రాజధానులు ఎలా కడతారు..!? అభివృద్ధి ఎలా సాధ్యం..!? అని ప్రశ్నించారు.