'ఎన్టీఆర్' సినిమా పన్నెండుసార్లు చూస్తా !

'ఎన్టీఆర్' సినిమా పన్నెండుసార్లు చూస్తా !

బాలక్రిష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం యొక్క ఆడియో వేడుకకు సినీ రంగ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు.  వారిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడ ఉన్నారు.  రామారావుగారితో పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన రాఘవేంద్రరావు వేదికపై మాట్లాడుతూ అన్నగారితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నేను ఆయనతో 12 సినిమాలు తీశాను, కాబట్టి ఈ ఎన్టీఆర్ సినిమాను నెలకోకసారి చొప్పున 12 సార్లు చూస్తాను అన్నారు.  ఇకపోతే ఈ చిత్రంలో రాఘవేంద్రరావుగారి పాత్రను ఆయన కుమారుడు ప్రకాష్ చేయడం విశేషం.