రివ్యూ: రాగల 24 గంటల్లో 

రివ్యూ: రాగల 24 గంటల్లో 

నటీనటులు: సత్యదేవ్, ఇషా రెబ్బా, శ్రీరామ్, గణేష్, కృష్ణభగవాన్ తదితరులు 

మ్యూజిక్: రఘు కుంచె 

సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి 

నిర్మాత: శ్రీనివాస్ కానూరు 

దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి 

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి డమరుకం సినిమా తరువాత ఆ స్థాయిలో సినిమా చేయలేదు. కామెడీ తరహా సినిమాలు చేసే దర్శకుడు కొత్తగా హర్రర్ జానర్లో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.  రాగల 24 గంటల్లో అనే పేరుతో సినిమా చేశాడు.  ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  సత్యదేవ్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉన్నదో తెలుసుకుందాం.  

కథ: 

అనగనగ ఒక ఊరు.. ఆ ఊరిలో ఉండే ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారు.  అలా జైలుకు వెళ్లిన ఆ ముగ్గురు జైలు నుంచి తప్పించుకుంటారు.  పోలీసులు తరుముతుండటంతో.. అక్కడినుంచి పారిపోయి.. ఓ ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో ఇషా రెబ్బ ఉంటుంది.    పోలీసులు ఇంట్లోకి వస్తున్నారని తెలుసుకున్న ఆ ముగ్గురు బెడ్ రూమ్ లో ఉన్న వార్డ్ రోబ్ లో దాక్కోవాలని చూడగా అందులో ఓ శవం ఉంటుంది. ఆ శవం ఎవరిదీ అని అడిగితె.. తన భర్త సత్యదేవ్ శవం అని చెప్తుంది.  దీంతో ఆ ముగ్గురు షాక్ అవుతారు.  భర్తను ఇషా ఎందుకు చంపింది..? ఇంట్లోకి ప్రవేశించిన ఆ ముగ్గురు రేపిస్టులకు.. ఇషా మధ్య ఏం జరిగింది ? ఆ ముగ్గురి చేతిలో అత్యాచారానికి గురైన మహిళ ఎవరు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో హర్రర్ మిక్స్ చేసి క్యూరియాసిటీని కలిగిచేలా పాయింట్ ఉన్నది.  ఈ పాయింట్ కు తగినట్టుగా కథనాలు ఉన్నాయా.. కథనాలు ఉంటె తప్పకుండా సినిమా హిట్ అవుతుంది.. ఇప్పటి వరకు కామెడీ బేస్డ్ లోనే సినిమాలను తెరకెక్కించిన శ్రీనివాస్ రెడ్డి.. ఈ సినిమాను థ్రిల్లర్ జానర్లో తెరక్కించింది కొంతమేర సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమా ఓపెనింగ్ నుంచే ప్రేక్షకుడిని లీనం చేసేలా కథనాలను రూపొందించాడు దర్శకుడు.  ముగ్గురు కరడుగట్టిన నేరస్తులు ఇంట్లోకి ప్రవేశించడం.. వారికీ ఇంట్లో శవం కనిపించడం.. ఆ వ్యక్తిని తానే హత్య చేశానని ఇషా చెప్పడంతో కథలో క్యూరియాసిటీ కలుగుతుంది.  ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో లవ్ సీన్స్ తో కొంత ట్రాక్ మారుతుంది.  కథకు ఈ ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ అవసరమే అయినప్పటికీ.. వేగం కాస్త మందగించింది.  సెకండ్ హాఫ్ లో చెప్పడానికి పెద్దగా కథ లేకపోయినా దర్శకుడు తన తెలివితో తీసుకొచ్చిన ట్విస్ట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.  ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్, సాంగ్ సినిమా వేగాన్ని కొంతమేర తగ్గించింది 

నటీనటుల పనితీరు: 

మొదటి నుంచి చెప్పినట్టుగా హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న స్టోరీలో ఇషా రెబ్బ రక్తికట్టించే విధంగా నటించింది. అందం అభినయంతో ఆకట్టుకుంది.  ఇక విలన్ గెటప్ లో సత్యదేవ్ నటన మరో స్థాయికి తీసుకెళ్లింది.  మిగతా నటీనటులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉన్నది.  శ్రీనివాస్ రెడ్డి థ్రిల్లింగ్ జానర్లో కూడా సినిమాలు చేయగలడు అని నిరూపించుకున్నాడు.  కథనాలు నడిపిన విధానం సినిమాకు ప్రధానంగా ప్లస్ అయ్యింది.  థ్రిల్లింగ్ సినిమాలకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బలంగా ఉండాలి.  ఈ రెండు సినిమాకు ప్లస్ అయ్యాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

స్టోరీ, స్క్రీన్ ప్లే 

నటీనటులు 

సెకండ్ హాఫ్ ట్విస్ట్స్ 

నెగెటివ్ పాయింట్స్: 

సాగతీత సన్నివేశాలు 

చివరిగా: రాగల 24 గంటల్లో ఏదైనా జరగొచ్చు..