ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి అడుగుపెట్టిన రఫెల్ యుద్ధ విమానాలు... 

ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి అడుగుపెట్టిన రఫెల్ యుద్ధ విమానాలు... 

ఈరోజు ఉదయం 11 గంటల తరువాత యూఏఈ ఎయిర్ బేస్ నుంచి ఐదు రఫెల్ యుద్ధ విమానాలు బయలు దేరిన సంగతి తెలిసిందే.  యూఏఈ నుంచి గుజరాత్ అక్కడి నుంచి అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకోబోతున్నాయి.  అయితే, అంబాలాలో మేఘాలు అనుకూలించని పక్షంలో జోధ్ పూర్ ఎయిర్ బేస్ లో వీటిని లాక్ చేసేందుకు అక్కడ కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.  ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి అడుగుపెట్టిన ఐదు రఫెల్ యుద్ధ విమానాలకు రక్షణగా రెండు ఎస్.యూ.30 యుద్ధ విమానాలు నిలిచాయి.  ముందు ఐదు విమానాలు వెళ్తుండగా, వాటి వెనుక రెండు ఎస్.యూ విమానాలు ఉండటం విశేషం.  మరికాసేపట్లో ఈ విమానాలు అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ కాబోతున్నాయి.  ఇక్కడి నుంచి వీటిని లడఖ్ వారి బేస్ కు ఆ తరువాత అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ లోని ఎయిర్ బేస్ కు తరలిస్తారు.  ఇందుకోసం రూ. 400 కోట్ల రూపాయలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లడఖ్, పశ్చిమ బెంగాల్ ఎయిర్ బేస్ లను ఇప్పటికే ఆధునీకరించింది.