టైర్ కు పంచర్ పడే ప్రసక్తే లేదు

టైర్ కు పంచర్ పడే ప్రసక్తే లేదు

బైక్ ఉండే ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు వెళ్లే మార్గంలో టైర్ పంచర్ పడి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. మార్గ మధ్యలో బైక్ పంచరైతే.. వారు పడే  అవస్థ అంతా ఇంతా కాదు. అయితే.. అలాంటి సమస్య తలెత్తకుండా ఓ రకమైన గ్లూ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ట్వీట్ చేశారు. దాని పనితీరు భద్రతకు సంబంధించిన విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. అయితే... టైర్ లైఫ్ కూడా పెరుగుతుందని అని చెబుతున్నారు. దీన్ని గురించిన మరిన్ని విషయాలు మీకు ఎవరికైనా తెలుసా అటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.  ఆ విజువల్స్ ఇప్పుడు సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.