పెళ్లి మీద నమ్మకం లేదు .. కేవలం దాని కోసమే చేసుకున్న 

పెళ్లి మీద నమ్మకం లేదు .. కేవలం దాని కోసమే చేసుకున్న 

తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘లెజెండ్‌’, ‘లయన్‌’ చిత్రాలతో ఆకట్టుకుంది నటి రాధికా ఆప్టే.. ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తుంటుంది రాధికా ఆప్టే. బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రాధికా ఎక్కువగా ఇండియాలోనే ఉంటుంది. ఇక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడూ తన భర్త కోసం లండన్ వెళ్తుంటుంది. తాజాగా తన పెళ్లి గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కెరీర్ కోసం పెళ్లి జీవితం త్యాగం చేస్తున్నారా అంటే..? తనకు అసలు పెళ్లిపై నమ్మకం లేదని.. విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వీసా ఈజీగా వస్తుందని తెలిసి చేసుకున్నట్లు వెల్లడించింది. కేవలం వీసా కోసం మాత్రమే మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేదని తెలిపింది.